22, జనవరి 2022, శనివారం

పచ్చటి తలకాడు ప్రాంతం ఇసుకదిబ్బగా మారడం వెనక ఉన్న వేదనామయ కథనం / తలకాడు శాపాల కథ

 ఇది కథ కాదు.... వాస్తవం. నాలుగు శతాబ్దాల క్రితం జరిగిన చారిత్రక సంఘటన. ఒక స్త్రీ ఆక్రోశం పచ్చటిప్రాంతాన్ని ఎడారిగా మార్చేసిన సంఘటన... ఒక రాజవంశాన్నే నిర్వీర్వం చేసేసిన సంఘటన....



    ఎడారి చూడాలంటే రాజస్థాన్ వెళ్ళాలా.... వెళ్ళాలిగా మరి ... ఎందుకంటే ఎడారి ఉండేది రాజస్థాన్ లోనే కదా అంటారు ఎవరైనా.... కాని ఎడారి చూడడానికి రాజస్థాన్ వరకు ఎందుకు... మన దక్షిణాదిలోనే ఉన్న కర్నాటక రాష్ట్రానికి వెళ్తే చాలు అంటాను నేను. ఏంటి ... వింతగా ఉంది కదూ... ఉంటుంది... ఎందుకంటే  రాజస్తాన్ లో ఎడారి అంటే ఎవరైనా అవునంటారు... కాని దక్షిణాదిలో అందులోను పచ్చదనానికి మారుపేరుగా ఉండే కర్నాటక రాష్ట్రంలో ఎడారి అంటే... ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు... కాని ఇది నిజం. 

    సరే విషయంలోకి వచ్చేస్తే ... కర్నాటక రాష్ట్రంలో ఉన్న ఎడారి తలకాడు. ఎడారిని తలపించే తలకాడు ప్రాంతం. దీని వెనక పెద్ద చరిత్రే ఉంది. ఒక స్త్రీ కన్నీటి గాధ ఉంది. ఆడదాని కన్నీటికి రాజ్యాలే కొట్టుకుపోయాయి. అలాంటిది ఒక రాజవంశం ఎంత? ఒక అందాల లోకం మోడువారిపోయింది. ఒక రాజవంశం నిర్వీర్యమయిపోయింది. పచ్చటి ప్రాంతం ఇసుక దిబ్బలుగా ఎడారిగా మారిపోయింది. అదే కర్నాటక రాష్ట్రంలోని మైసూర్ కు 43 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యక్షేత్రం తలకాడు. ఏంతో అందమైన, ఆకర్షణీయమైన, 30 కి పైగా ఆలయాలతో కళకళలాడిన ఆ క్షేత్రం రాణి ఆవేదనకు శాపాల దిబ్బగా మారిపోయింది.




    ఇది పురాణకాలం నుంచి వస్తున్నా చరిత్రే.... అలాంటి చరిత్రే కర్నాటక రాజవంశాల్లోను జరిగింది. అది కల్పిత కథ కాదు. దాదాపు నాలుగు శతాబ్దాల క్రితం జరిగిన చారిత్రక సంఘటన. మైసూర్ రాణి అలమేలమ్మ చరిత్ర. అసలు రాణి అలమేలమ్మ ఇంత ఘోరమైన శాపం ఎందుకిచ్చింది? ఎవరికిచ్చింది? తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చెయ్యండి.....
  
   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి