31, జనవరి 2022, సోమవారం

ఎడారి అద్భుతం బుర్జ్ ఖలీఫా దుబాయ్

 

163 అంతస్తులు, 829.8 మీటర్లు  అంటే 2,722 అడుగుల ఎత్తు, అమెరికన్ డాలర్లలో అయితే 150 కోట్లు,  మన రూపాయిలలో అయితే దాదాపు 9450 కోట్ల ఖర్చు. 900 అపార్టుమెంట్లు, 30,000 నివాసాలు , 7.4 ఎకరాల విస్తీర్ణం కలిగిన 9 హోటళ్లు , కొన్ని వందల షాపులతో ప్రపంచ ప్రసిద్ధి చెందినా దుబాయ్ మాల్ , మొత్తం మీద 30 ఎకరాల విస్తీర్ణం వెరసి బుర్జ్ ఖలీఫా. అద్భుతం... ఎడారి అద్భుతం... బుర్జ్ ఖలీఫా.

    ఆ భవనాన్ని చూస్తూ ఆకాశంలో మేఘాలు అనుకుంటాయి అరెరెరె..... మనల్ని చేత్తో పట్టేసుకుంటుందా ఏంటా భవనం. ఒక నగరంలో భవనాలుండడం మనం చూస్తాం. కాని ఒక భవనంలో నగరం ఉండడం మీకు తెలుసా!? అలాంటిభవన నగరం గురించి విన్నారా!? ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా గురించి కొన్ని విశేషాలు....

                            👇 👇 👇 👇 👇

                                        

ఎమోజీ కథా కమామీషు

         ఎమోజీ..... డిఫరెంట్ ఫీలింగ్స్ చూపించే చిన్నచిన్న ముఖాలు.... ఫేస్ బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రాం, ట్విట్టర్  ఎక్కడ చూసినా ఇవే... సోషల్ మీడియాను ఎక్కువగా వాడేవారికి ఎమోజీల గురించి ప్రత్యేకంగా పరిచయం చెప్పనక్కర్లేదు. మాటలతో చెప్పలేని మన ఫీలింగ్స్ ఈ ఎమోజీలతో ఈజీగా చెప్పేయవచ్చు. ముఖ్యంగా వాట్సాప్‌, ఇంస్తాగ్రాం లాంటి సోషల్ మీడియాలో చాటింగ్ చేసేప్పుడు చాలామంది వీటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక్కోసారి మనం వంద మాటల్లో చెప్పలేని భావాలను ఒక్క ఎమోజీతో ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పెయ్యొచ్చు. 


    నవ్వుతున్న ఏమోజి, వెక్కిరిస్తున్న ఎమోజీ, ఏడుస్తున్న ఎమోజీ, విచారం, సంతోషం, ఆశ్చర్యం, కోపం, క్రోధం, చిరాకు, ప్రేమ, అసూయ..బాధ ఇలా ఎన్నో భావాలు ఒకటి రెండు కాదు పది ఇరవై కాదు వంద రెండు వందలు కాదు వెయ్యి రెండు వేలు కూడా కాదు దాదాపు మూడువేల ఆరువందల పైచిలుకు ఎమోజీలు అందుబాటులో ఉన్నాయి. అంతేనా ఈ ఎమోజీల ఇంకా చాలా వుంది. మరా చాలా ఏంటో ఓ లుక్కేద్దామా..... అయితే ఈ వీడియో క్లిక్ చెయ్యండి.....
                                            
                                                 👇 👇 👇 👇 👇 

22, జనవరి 2022, శనివారం

పచ్చటి తలకాడు ప్రాంతం ఇసుకదిబ్బగా మారడం వెనక ఉన్న వేదనామయ కథనం / తలకాడు శాపాల కథ

 ఇది కథ కాదు.... వాస్తవం. నాలుగు శతాబ్దాల క్రితం జరిగిన చారిత్రక సంఘటన. ఒక స్త్రీ ఆక్రోశం పచ్చటిప్రాంతాన్ని ఎడారిగా మార్చేసిన సంఘటన... ఒక రాజవంశాన్నే నిర్వీర్వం చేసేసిన సంఘటన....



    ఎడారి చూడాలంటే రాజస్థాన్ వెళ్ళాలా.... వెళ్ళాలిగా మరి ... ఎందుకంటే ఎడారి ఉండేది రాజస్థాన్ లోనే కదా అంటారు ఎవరైనా.... కాని ఎడారి చూడడానికి రాజస్థాన్ వరకు ఎందుకు... మన దక్షిణాదిలోనే ఉన్న కర్నాటక రాష్ట్రానికి వెళ్తే చాలు అంటాను నేను. ఏంటి ... వింతగా ఉంది కదూ... ఉంటుంది... ఎందుకంటే  రాజస్తాన్ లో ఎడారి అంటే ఎవరైనా అవునంటారు... కాని దక్షిణాదిలో అందులోను పచ్చదనానికి మారుపేరుగా ఉండే కర్నాటక రాష్ట్రంలో ఎడారి అంటే... ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు... కాని ఇది నిజం. 

    సరే విషయంలోకి వచ్చేస్తే ... కర్నాటక రాష్ట్రంలో ఉన్న ఎడారి తలకాడు. ఎడారిని తలపించే తలకాడు ప్రాంతం. దీని వెనక పెద్ద చరిత్రే ఉంది. ఒక స్త్రీ కన్నీటి గాధ ఉంది. ఆడదాని కన్నీటికి రాజ్యాలే కొట్టుకుపోయాయి. అలాంటిది ఒక రాజవంశం ఎంత? ఒక అందాల లోకం మోడువారిపోయింది. ఒక రాజవంశం నిర్వీర్యమయిపోయింది. పచ్చటి ప్రాంతం ఇసుక దిబ్బలుగా ఎడారిగా మారిపోయింది. అదే కర్నాటక రాష్ట్రంలోని మైసూర్ కు 43 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యక్షేత్రం తలకాడు. ఏంతో అందమైన, ఆకర్షణీయమైన, 30 కి పైగా ఆలయాలతో కళకళలాడిన ఆ క్షేత్రం రాణి ఆవేదనకు శాపాల దిబ్బగా మారిపోయింది.




    ఇది పురాణకాలం నుంచి వస్తున్నా చరిత్రే.... అలాంటి చరిత్రే కర్నాటక రాజవంశాల్లోను జరిగింది. అది కల్పిత కథ కాదు. దాదాపు నాలుగు శతాబ్దాల క్రితం జరిగిన చారిత్రక సంఘటన. మైసూర్ రాణి అలమేలమ్మ చరిత్ర. అసలు రాణి అలమేలమ్మ ఇంత ఘోరమైన శాపం ఎందుకిచ్చింది? ఎవరికిచ్చింది? తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చెయ్యండి.....
  
   

20, జనవరి 2022, గురువారం

ఏడురాళ్ళ ముక్కుపుడక కథ ఆడియో

                                                   ఏడురాళ్ళ ముక్కుపుడక కథ


తన రిటైర్మెంట్ ఫంక్షన్ కు పెళ్ళికొడుకులా తయారయి సంబరంగా వెళ్ళిన  అతను అంటే సంబరంగా తను రిటైరయిన సందర్భంగా తన ప్రియమైన భార్యకు ఏడురాళ్ళ ముక్కుపుడక కొని ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఆత్రంగా ఇంటికి వచ్చిన ఆ భర్తకు ఆ భార్య ఇచ్చిన బహుమతి ఏంటి? హృదయాన్ని మెలిపెట్టే అద్భుత కథనం...... ఏడురాళ్ళ ముక్కుపుడక ఆడియో రూపంలో 
 

ఇక్కడ క్లిక్ చెయ్యండి ......👇👇

'మావిడాకులు' కథ

సంచిక ఆన్ లైన్ పత్రికలో ప్రచురించబడిన నా స్వీయరచన కథ ఈ బ్లాగ్ లో ... మరి చదివి మీ అభిప్రాయాలు చెప్తారు కదూ... సంచిక లింక్ మీకోసం...   https:...